సరిగ్గా 16 ఏళ్ల క్రితం 2006లో భారత్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ () జరిగింది. ఆ టోర్నీ మధ్యలో స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఖో ఖో అడుతూ మోకాలి గాయం బారిన పడ్డాడు. దాంతో అతడు ఐదు నెలల పాటు క్రికెట్ కు దూరం కావాల్సి వచ్చింది. చాంపియన్స్ ట్రోఫీలో యువరాజ్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. నాకౌట్ దశకు చేరకుండానే భారత్ టోర్నీ నుంచి తప్పుకుంది.