టీ20 ప్రపంచకప్ (T20 World Cup) తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ (Virat Kohli) గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక, ఈ టోర్నీ ముగిసిన తర్వాత న్యూజిలాండ్తో టీ20 సిరీస్ ఆడనుంది భారత జట్టు. నవంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే ఈ టీ20 సిరీస్ నుంచి భారత హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid).
టీమిండియా యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah )కు సారథ్యం వహించే సామర్థ్యం ఉందని ఈ మాజీ పేసర్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్ రేసులో నిలిచిన కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ కన్నా బుమ్రాను కెప్టెన్ చేయడం ఉత్తమమన్నాడు. అతను మూడు ఫార్మాట్లు ఆడుతున్న ప్లేయరని, రాహుల్, రిషభ్ పంత్ పరిమిత ఓవర్ల సిరీస్ల్లోనే ఆడుతున్నారని గుర్తు చేశాడు.