ఓపెనర్ డేవిడ్ వార్నర్(167 బంతుల్లో 11 ఫోర్లతో 95) పరుగులతో సత్తా చాటాడు. టీ బ్రేక్ తర్వాత ధాటిగా ఆడిన వార్నర్.. మళ్లీ సెంచరీ ముంగిట వికెట్ సమర్పించుకున్నాడు. స్టోక్స్ బౌలింగ్‌లో బ్రాడ్‌కు క్యాచ్ వెనుదిరిగాడు. ఇక ఫస్ట్ టెస్ట్‌లో కూడా వార్నర్ ఇలానే 94 పరుగులకు ఔటై సెంచరీ చేజార్చుకున్న విషయం తెలిసిందే.