2. యాష్ అంటే బూడిద అని అర్థం. దీని మూలాలు తెలుసుకోవాలంటే..1882 లో ఈ రెండు దేశాల మధ్య ఆడిన ఓ ఉత్తేజకరమైన మ్యాచ్‌తో ముడిపడి ఉన్నాయి. ఈ సమయంలో చాలా మ్యాచ్‌లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో మాత్రమే జరిగాయి. కొన్ని అనూహ్య కారణాలతో ఒక మ్యాచ్ ఫలితం ఫలితంగా ఈ సిరీస్‌కు యాషెస్ అని పేరు పెట్టారు. (The Ashes trophy - AP Photo)
4. క్రికెట్ అంటేనే అన్ ప్రిడిక్టబుల్ కాబట్టి.. అనూహ్యంగా ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాకు ఇది తొలి విజయం. ఆగస్టు 29 న ఇంగ్లండ్ ఓడిపోయింది. ఈ ఓటమి ఇంగ్లండ్ మీడియాను తాకింది. ఇంగ్లండ్‌లోని ప్రతీ వార్తాపత్రిక ఇంగ్లండ్ టీంను దారుణంగా విమర్శిస్తూ వ్యాసాలు వందల్లో వెలువడ్డాయి. (AP Photo)
5. ఈ ఓటమి తరువాత, స్పోర్టింగ్ టైమ్స్ అనే పత్రిక ఇంగ్లీష్ క్రికెట్ కోసం ఒక సంతాప సందేశాన్ని ప్రచురించింది. “ఇంగ్లీష్ క్రికెట్ చనిపోయింది. 29 ఆగస్టు 1882, ఓవల్‌లో ఇంగ్లండ్ టీం అంత్యక్రియల తర్వాత వచ్చిన బూడిదను (యాషెస్) ఆస్ట్రేలియా తీసుకెళ్లింది.. ” అంటూ రాసుకొచ్చింది. (Pat Cummins makes - AP Photo)