ఇంగ్లండ్ ను మరో సారి వణికించింది ఆస్ట్రేలియా టీమ్. చివరిదైన ఐదో టెస్ట్ లో 146 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది.
2/ 10
ప్రతిష్టాత్మక ట్రోఫీని 4-0 తేడాతో కైవసం చేసుకుంది ఆస్ట్రేలియా టీమ్.
3/ 10
సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన.. ట్రావిస్ హెడ్ ఆఖరి టెస్టులోనూ మరోసారి సెంచరీతో మెరిశాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
4/ 10
ఇక పర్యాటక జట్టు ఇంగ్లండ్‌కు మాత్రం ఈ సిరీస్ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేక చతికిలపడింది. నాలుగో టెస్టును డ్రా చేసుకోవడం వారికి కాస్త ఊరట కలిగించే అంశం
5/ 10
చివరి మ్యాచ్ లో నైనా గెలిచి పరువు దక్కించుకోవాలనుకున్న ఇంగ్లాండ్..బ్యాటర్ల వైఫల్యంతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. కంగూరు జట్టు నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక.. 124 రన్స్ కే కుప్పకూలింది.
6/ 10
271 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ (England) ఓపెనర్లు శుభారంభం అందించారు. క్రాలే (36), రోరీ బర్న్స్ (26) తొలి వికెట్‌కు అర్ధశతక (68) భాగస్వామ్యం నెలకొల్పారు.
7/ 10
అయితే బర్న్స్ ఔటైన తర్వాత ఒక్కరు కూడా ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేయలేదు. వచ్చిన వారు వచ్చినట్టే వెనుదిరిగారు.
8/ 10
ఆసీస్ బౌలర్లు ధాటికి...కేవలం 56 పరుగులకే మిగతా తొమ్మిది వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. మలన్ 10, రూట్ 11, స్టోక్స్ 5, పోప్ 5, బిల్లింగ్స్ 1, వోక్స్ 5, మార్క్‌వుడ్ 11 పరుగులు చేశారు.
9/ 10
ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ 3, బొలాండ్ 3, గ్రీన్ 3.. స్టార్క్ ఒక వికెట్ పడగొట్టాడు.
10/ 10
ఇక, ఏకపక్ష విజయాలతో సిరీస్ కైవసం చేసుకున్న కంగారూలు రెట్టించిన ఉత్సాహంతో అంబరాన్నంటేలా సంబరాలు చేసుకున్నారు.