ASH BARTY CREATES HISTORY WINS 44 YEAR DROUGHT BREAKING AUSTRALIAN OPEN 2022 OVER DANIELLE COLLINS SRD
Ash Barty : శభాష్ యాష్లే బార్టీ.. 44 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన టెన్నిస్ స్టార్..
Ash Barty : ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ యాష్లే బార్టీ చరిత్ర క్రియేట్ చేసింది. ఆస్ట్రేలియా ఓపెన్ 2022 మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది యాష్లే బార్టీ.
సీజన్ ఫస్ట్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను యాష్లే బార్టీ కైవసం చేసుకుంది. ఏకపక్షంగా జరిగిన మెగా ఫైట్ లో బార్టీ 6-3,7-6(7-2)తో వరుస సెట్లలో ప్రత్యర్థి చిత్తు చేసింది.
2/ 10
మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ యాష్లే బార్టీ 6-3, 7-6 తేడాతో అమెరికా అమ్మాయి, 27వ సీడ్ డానియల్ కొలిన్స్‌ను చిత్తు చేసింది.
3/ 10
దీంతో, 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియా ప్లేయర్‌గా యాష్లె బార్టీ గుర్తింపు పొందింది. 1978లో క్రిస్టీన్ ఓనెల్ తొలి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలవగా.. ఇప్పుడు యాష్లే బార్టీ ఆ ఘనతను అందుకుంది.
4/ 10
టోర్నీలో ఫెవరెట్‌గా బరిలోకి దిగిన బార్టీ సొంతగడ్డపై చెలరేగి ఆడింది. ముఖ్యంగా డానియెల్ కొలిన్స్‌తో జరిగిన ఫైనల్లో మ్యాచ్‌ను ఏకపక్షంగా సొంతం చేసుకుంది.
5/ 10
తొలి సెట్‌ను 6-3తో సొంతం చేసుకున్న బార్టీ.. రెండో సెట్లో కొలిన్స్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. రెండో సెట్ 6-6తో టై బ్రేక్‌కు దారి తీసింది.
6/ 10
అయితే సెట్ చివరి గేమ్‌లో ఫుంజుకున్న బార్టీ మొత్తంగా 7-6(7-2)తో రెండోసెట్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన బార్టీ మెయిడెన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
7/ 10
మ్యాచ్‌లో బార్టీ 10 ఏస్‌లు సందించి.. మూడు డబుల్ ఫాల్ట్‌లు నమోదు చేయగా.. కొలిన్స్ ఒక ఏస్ సందించి.. రెండు డబుల్‌ఫాల్ట్‌లు చేసింది.
8/ 10
కెరీర్లో బార్టీకి ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ కాగా.. రెండేళ్ల క్రితం ఫ్రెంచ్ ఓపెన్, గతేడాది వింబుల్డన్ టైటిల్ గెలుచుకుంది.
9/ 10
ఇక యూఎస్ ఓపెన్ ఒక్కటి గెలిస్తే యాష్లే బార్టీ కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసుకోనుంది.
10/ 10
టోక్యో ఒలింపిక్స్‌లో మొదటి రౌండ్ నుంచే నిష్కమించిన యాష్ బార్టీ, అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది.