ARE YOU NEERAJ THESE BUMPER OFFERS ARE FOR YOU ONLY FREE PETROL AND FREE RIDES IN ROPE WAY CHECK HERE JNK
Neeraj Chopra: మీ పేరు నీరజ్.. అయితే ఈ బంపర్ ఆఫర్లు మీ కోసమే.. ఉచిత పెట్రోల్.. ఫ్రీ రైడ్స్.. అబ్బో ఆఫర్లే ఆఫర్లు
నీరజ్ చోప్రా స్వర్ణ పతకం గెలవడంతో ఆ పేరుతో ఉన్న వాళ్ల పంట పండింది. మీ పేరు కనుక నీరజ్ అయితే మీ ఐడీ కార్డ్ చూపించి ఉచితంగా పెట్రోల్, రోప్ రైడ్ పొందవచ్చు. ఎక్కడో చూడండి ఒక్కసారి.
టోక్యో ఒలింపిక్స్ 2021లో భారత్‌కు స్వర్ణ పతకం అందించి నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 100 ఏళ్ల తర్వాత భారత్ అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం ఖాతాలో వేసుకుంది. దీంతో నీరజ్ పేరు దేశమంతా మార్మోగిపోతున్నది. (Instagram/Twitter)
2/ 9
టోక్యో ఒలింపిక్స్ 2020 జావెలిన్ త్రో ఈవెంట్లో నీరజ్ చోప్రా 87.58 మీటర్లు విసిరి స్వర్ణ పతకం గెలిచాడు. (PC: Olympics)
3/ 9
జావెలిన్ త్రోలో గతంలో భారత అథ్లెట్లు ఎవరూ ఫైనల్ చేరలేదు. కానీ నీరజ్ చోప్రా ఫైనల్ చేరడమే కాకుండా ఏకంగా స్వర్ణం గెలవడంతో దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. (PC: Instagram/Neeraj)
4/ 9
నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచాక ప్రశంసలతో పాటు క్యాష్ రివార్డులు కూడా భారీగా ప్రకటించారు. (PC: Instagram/Neeraj)
5/ 9
హర్యాణా ప్రభుత్వం క్లాస్-1 జాబ్కూడా ఆఫర్ చేసింది. విలువైన స్థలాన్ని కూడా తక్కవ ధరకే అందిస్తామని ప్రకటించింది. (PC: Instagram/Neeraj)
6/ 9
ఇక నీరజ్ గెలుపు సంబరాలను కొన్ని కంపెనీలు వినూత్నంగా జరుపుతున్నాయి. తమ సంస్థల్లో భారీగా ఆఫర్లు ప్రకటించాయి. గుజరాత్‌లోని భరూచ్‌లోని ఒక పెట్రోల్ పంపు యాజమాన్యం ఉచిత పెట్రోల్ ఆఫర్ ప్రకటించింది. (PC: News18)
7/ 9
నీరజ్ అనే పేరు ఉన్న వారికి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు ఉచిత పెట్రోల్ ఆఫర్ ప్రకటించింది. సదరు బంక్‌కు నీరజ్ పేరుతో ఉన్న ఐడీ కార్డును తీసుకొని వెళ్లి చూపెడితే ఉచితంగా పెట్రోల్ పోస్తారు. (PC: News18)
8/ 9
గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఉన్న గిర్నార్ రోప్‌వే కంపెనీ ఆగస్టు 20 వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. నీరజ్ అనే పేరు ఉంటే వారికి ఉచితం అని సదరు కంపెనీ ప్రకటించింది. (PC: News18)
9/ 9
ఇక మరెందుకు ఆలస్యం.. మీ పేరు నీరజ్ అయితే.. ఆ ఆఫర్లు ప్రకటించిన ప్రదేశానికి దగ్గరగా ఉంటే వెంటనే వెళ్లి క్లెయిమ్ చేసుకోండి. (PC: Instagram/Neeraj)