Virushka : కోహ్లీ , వామికా ఫోటోల్ని షేర్ చేసిన అనుష్క శర్మ..కానీ, అక్కడే ఉంది అసలైన ట్విస్ట్..

Virushka : ఈ ఏడాది జనవరిలో విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. పాప పుట్టి ఆరు నెలలు దాటినా.. ఇంతవరకు తనకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా షేర్ చేయలేదు కోహ్లీ దంపతులు. అయితే, ఆరు నెలలు అయినా సందర్భంగా.. కోహ్లీ, వామికా ఫోటోల్ని షేర్ చేసింది అనుష్క శర్మ. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయ్.