అయితే అనుష్క శర్మ(Anushka Sharma) ఆదివారం రాత్రి హఠాత్తుగా కోల్‌కతాలో ప్రత్యక్షమైంది. ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్‌కు కోహ్లీ సిద్ధమవుతున్న సమయంలో అతని సతీమణి ఈడెన్ గార్డెన్స్‌లో బౌలింగ్ చేయడానికి వచ్చింది. అనుష్క శర్మకు బౌలింగ్‌కు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* జులన్(Jhulan) బయోపిక్‌లో అనుష్క శర్మ : ఇండియా ఉమెన్ క్రికెటర్లలో అందరికీ గుర్తుండే పేరు జులన్ గోస్వామి. రెండు దశాబ్దాలపాటు ఆమె ఇండియన్ ఉమెన్స్ క్రికెట్‌కు సేవలు అందించింది. ఇటీవలే ఆమె మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకొంది. ఆమె 12 టెస్టుల్లో 44 వికెట్లు, 68 టీ20ల్లో 56 వికెట్లు, 204 వన్డేల్లో 255 వికెట్లు పడగొట్టింది.
ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ బౌలర్‌పైన ఓ సినిమా రూపొందిస్తున్నారు. జులన్ ముద్దుపేరు చక్దా ఎక్స్‌ప్రెస్(Chakda Xpress) పేరుతో వస్తున్న సినిమాలో అనుష్క శర్మ్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసమే అనుష్క శర్మ్ కోల్‌కతాలో అడుగుపెట్టింది. చక్దా ఎక్స్‌ప్రెస్ షూటింగ్ సోమవారం ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభమైంది.
* జులన్ గోస్వామితో అనుష్క : నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్ చక్దా ఎక్స్‌ప్రెస్ సినిమాకు ప్రసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. జులన్ బంతిని పట్టుకునే తీరు, ఆమె పరుగు తీసే విధానంపై పట్టు సాధించేందుకు అనుష్క శర్మ శ్రమిస్తోంది. ఈడెన్ గార్డెన్లో అనుష్క శర్మతోపాటు జులన్ గోస్వామి కూడా కనిపించింది. సోమవారం మాత్రం అనుష్క ఒంటరిగానే ఈడెన్‌లో అడుగుపెట్టింది. అనుష్క ఆదివారం తెల్లటి డ్రెస్‌లో ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. ముఖానికి నల్లని ముసుగు ఉన్నా.. ఆమె వైఖరి చూసి సులువుగా గుర్తుపట్టవచ్చు.
* ఫిబ్రవరి 2న విడుదల : మహిళా క్రికెటర్‌పై తీసిన సినిమాల్లో చక్దా ఎక్స్‌ప్రెస్ ఉత్తమంగా ఉండాలని అనుష్క భావిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌లో సీన్లను లండన్‌లో చిత్రీకరించారు. ఈ మూవీని అనుష్క సోదరుడు కర్నిష్ నిర్మాణ సంస్థ క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా స్టోరీ అండర్ డాగ్స్ జర్నీగా అనుష్క పేర్కొంది.
OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో 2023 ఫిబ్రవరి 2న మూవీ రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం అనుష్క అభిమానులు ఆమె తెరపై కనిపించడం కోసం ఎదురుచూస్తున్నారు. జీరో మూవీ తర్వాత అనుష్క శర్మ బాలీవుడ్‌కు పూర్తిగా దూరమైంది. షారుఖ్, అనుష్క, కత్రినాల చిత్రం 2018 డిసెంబర్లో విడుదలైంది. నాలుగేళ్లుగా అనుష్క సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.