సొంత గడ్డపై జరుగుతున్న టెస్టు సిరీసుల్లో పాకిస్థాన్ బొక్క బోర్లా పడుతుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్.. ఇప్పుడు న్యూజిలాండ్ సిరీసుల్లో అసలు ఏ మాత్రం కనీస పోటీ ఇవ్వడం లేదు దాయాది దేశం. అంతేకాకుండా.. ఈ మ్యాచులు కూడా క్రికెట్ ఫ్యాన్స్ కు బోర్ కొడుతున్నాయి. అందుకు కారణం ఫ్లాట్ పిచ్ లు తయారు చేయడమే. (pc : twitter)
ఇక.. తమకు అనుకూలంగా ఉండే వికెట్లతో క్రికెట్ ప్రపంచం ముందు పాకిస్థాన్ అబాసుపాలు అవుతోంది. గతేడాది ఆస్ట్రేలియాతో రావల్పిండి వేదికగా ముగిసిన టెస్టుతో పాటు కరాచీ, ముల్తాన్ లలో అన్నీ ఫ్లాట్ పిచ్ లే తయారుచేసింది.బ్యాటర్లు పండుగ చేసుకున్న ఈ పిచ్ పై బౌలర్లు బంతులు విసిరి విసిరి అలిసిపోయారే తప్ప వికెట్లు మాత్రం తీయలేకపోయారు. సాక్షాత్తు ఐసీసీ కూడా ఈ విషయంలో పాకిస్తాన్ ను మందలించింది. ఈ పిచ్ లకు 'బిలో యావరేజ్' రేటింగ్ ఇచ్చింది. (pc : twitter)
అయితే.. అసంతృప్తితో ఉన్న పాక్ క్రికెట్ ఫ్యాన్స్ కు మంచి ఆనందాన్ని పంచాడు ఆ దేశ మాజీ క్రికెటర్ బాజిద్ ఖాన్. అయితే.. బాజిద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు తెగ మీమ్స్ ట్రోల్ అవుతున్నాయి. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాజిద్ ఖాన్ మాట్లాడిన వచ్ఛీరాని ఇంగ్లీష్ వారిని నలుగురిలో నవ్వులు పాలు చేసింది. దీనంతటికి కారణం.. అమెరికన్ పోర్న్ స్టార్ డానీ డేనియల్స్. (pc : twitter)
కరాచీ వేదికగా పాకిస్థాన్–న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా జరుగుతోంది. అలాంటి మ్యాచులో పాక్ మాజీ క్రికెటర్ బాజిద్ ఖాన్ నవ్వులు పూయించారు. ఈ మ్యాచులో కామెంటేటర్ గా అవతారమెత్తిన బాజిద్ ఖాన్, లైవ్ కామెంట్రీలో న్యూజిలాండ్ మాజీ ఆటగాడు పేరు మర్చిపోయి.. పొరపాటున అమెరికన్ పోర్న్ స్టార్ పేరును ఉచ్ఛరించాడు. (pc : twitter)