31వ ర్యాంకర్ ప్లవీచెంకోవా 6-7(2-7), 6-2, 9-7 తేడాతో ఎలేనా రిబకీనాపై విజయం సాధించి సెమీస్ చేరింది. ప్రీ క్వార్టర్స్‌లో సెరేనా విలియమ్స్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరిన రిబకీనా మొదటి సెట్ గెలిచింది. కానీ ఆ తర్వాత పట్టుకోల్పోయింది. చివరి సెట్లో తొలుత ప్లవీచెంకోవా సర్వీస్ బ్రేక్ చేసి ముందుకు వెళ్లినా.. ఆ తర్వాత చేతులెత్తేసింది. దీంతో ప్లవీచెంకోవా సెమీస్ చేరింది. (PC: Instagram)