Euro Cup 2020 : గ్రూప్ డి లోని జట్లు, కీలక ఆటగాళ్లు, టీమ్స్ బలబలాలపై ఓ లుక్కేయండి..

Euro Cup 2020 : ఫిఫా వరల్డ్ కప్ తర్వాత అత్యంత ఆదరణ పొందిన మరో మెగా టోర్నీ యూరో కప్ (Euro Cup 2021). ఐరోపా దేశాల మధ్య జరిగే ఈ ఫుట్ బాల్ చాంపియన్‌షిప్ ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తుంటారు. షెడ్యూల్ ప్రకారం గత ఏడాది 12 జూన్ నుంచి 12 జులై వరకు ఈ టోర్నీ నిర్వహించాల్సి ఉన్నది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఏడాది పాటు వాయిదా వేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం 2021 జూన్ 11 నుంచి జులై 11 వరకు ఈ చాంపియన్‌షిప్ నిర్వహించనున్నారు. 24 జట్లను ఆరు గ్రూప్ లుగా విభజించి టోర్నీ నిర్వహిస్తున్నారు. ఇక, గ్రూప్ డి లో ఇంగ్లండ్ టీమ్ ఫేవరేట్ గా కన్పిస్తోంది. ఈ గ్రూప్ లోని జట్ల బలబలాల గురించి తెలుసుకుందాం.