మరో కొద్ది రోజుల్లో క్రికెట్ కుంభమేళ ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 26న చెన్నై సూపర్ కింగ్స్ (Chennai super kings), కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata knight Riders) జట్ల మధ్య జరిగే మ్యాచ్ తో ఐపీఎల్ 15వ సీజన్ ఘనంగా ఆరంభం కానుంది. ఇప్పటికే కొన్ని జట్లు ప్రాక్టీస్ క్యాంపుల్ని కూడా మొదలుపెట్టేశాయ్.