అయితే, ఈ ప్రాక్టీస్ సెషన్ తర్వాత కెప్టెన్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో పంచుకున్నాడు. ట్రైనింగ్ సెషన్లో కోహ్లి చిత్రాలను చూస్తుంటే బీసీసీఐకి, అతడికి మధ్య జరిగిన వివాదాల తర్వాత కూల్ గా కన్పిస్తున్నాడని సబా కరీమ్ చెప్పాడు. ఈ వివాదం తర్వాత అతని తలపై పెద్ద భారం తొలిగిపోయినట్లు కన్పిస్తోందని సబా కరీమ్ కామెంట్ చేశాడు.
రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, శుభ్ మన్ గిల్, అక్షర్ పటేల్ వంటి కీలకమైన ఆటగాళ్లు టెస్టు జట్టుకు దూరమైనా దక్షిణాఫ్రికాను ఓడించే సత్తా ఇండియాకు ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. గత 29 ఏళ్లగా ఏ భారత జట్టు కెప్టెన్‌కు సాధ్యం కాని ఫీట్‌ను విరాట్ కోహ్లీ చేసి చూపెట్టాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
భారత టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, ప్రియాంక్ పంచల్, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్ (WK), వృద్ధిమాన్ సాహా (WK), రవిచంద్రన్ , జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్ మరియు మహ్మద్ సిరాజ్.