ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (Ashes Series)లో ఆస్ట్రేలియా (Australia) దుమ్మురేపుతోంది. ప్రత్యర్ధి ఇంగ్లండ్ (England) కు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా రెచ్చిపోతుంది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లోనూ సమష్టిగా విఫలమైన ఇంగ్లండ్ 275 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. దీంతో సిరీస్ లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఈ గ్రాండ్ విక్టరీతో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్(2021-23) పాయింట్స్ టేబుల్లో టాప్-2కి దూసుకెళ్లింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫస్ట్ సిరీస్ ఆడుతున్న ఆసీస్.. వరుసగా రెండు విజయాలతో 24 పాయింట్లను ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో నిలిచింది. అగ్రస్థానంలో శ్రీలంక(24 పాయింట్లు) కొనసాగుతుండగా.. మూడో స్థానంలో పాకిస్థాన్(36 పాయింట్లు) తో నిలిచింది.