Home » photogallery » sports »

AFTER RCB FAN GIRL DEEPIKA GOSH MUMBAI INDIANS FAN GIRL ADITI HUNDIA MAKING SENSATION IN SOCIAL MEDIA CR

దీపికా తర్వాత ఈ పిల్లే!... అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ముంబై ఫ్యాన్ గర్ల్...

దీపికా ఘోష్... క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇప్పుడీ పిల్ల పేరు తెలియనివారు ఉండకపోవచ్చు. కెమెరామెన్ పున్యమాని టీవీ తెరల మీద మెరిసిన ఆర్‌సీబీ ఫ్యాన్ గర్ల్‌... సోషల్ మీడియాలో పెను సంచలనమే క్రియేట్ చేసింది. ఒక్కసారిగా ఫాలోవర్స్‌తో ఆమె ఖాతా అధికారిక గుర్తింపు పొందింది. ఇప్పుడు మరో క్రికెట్ ఫ్యాన్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్‌లో స్టేడియంలో మెరిసిన ఓ ముద్దుగుమ్మను కెమెరామెన్ పదేపదే టీవీలో చూపించాడు. చిరునవ్వులు చిందిస్తూ, కేరింతలు కొట్టిన ఆమె... ఇప్పుడు టీవీ నుంచి సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారిపోయింది. సినిమా డైరెక్టర్ల కంటే మెరుగ్గా అందమైన ముద్దుగుమ్మలను వెతికి పట్టుకుంటున్న టీవీ కెమెరామెన్‌లో సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయంటే ఆమె ఎవరో తెలుసుకోవాల్సిందే...