ఇక వెస్టిండీస్ ఆటగాడు జేసన్ హోల్డర్ ఒక స్థానం దిగజారి 382 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఎడమచేతి వాటం బ్యాటర్ జడేజా 17 స్థానాలు ఎగబాకి 54వ స్థానం నుంచి 37వ స్థానానికి చేరుకున్నాడు. మొహాలీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు తీశాడు. దీంతో బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 17వ స్థానానికి చేరుకున్నాడు.
మొహాలీలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఇక టీమిండియా మరో ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ఒక స్థానం కోల్పోయి 347 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్, ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్, ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ స్టార్క్, కివీస్ ప్లేయర్లు కైలీ జెమీషన్, కొలిన్ డీ గ్రాండ్‌హోం, ఆసీస్ టెస్టు, ఇంగ్లండ్ ప్లేయర్ క్రిస్ వోక్స్ వరుసగా టాప్ 10లో చోటు దక్కించుకున్నారు.