ఇక, రషీద్ ఖాన్ కెప్టెన్సీలోని అఫ్గానిస్తాన్ దుమ్మురేపింది. మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో పాక్ ను చిత్తు చేసింది. 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. అఫ్గాన్ ను లైట్ గా తీసుకుని దాయాది దేశం బొక్కబోర్లాపడింది. ఫస్ట్ రెండు మ్యాచులు వరుసగా గెలిచిన అఫ్గాన్.. చివరి మూడో టీ20 మ్యాచులో మాత్రం 66 పరుగుల తేడాతో ఓడిపోయింది.