దాంతో సెమీస్ చేరిన నాలుగు జట్లు కూడా కఠోరంగా సాధన చేస్తున్నాయి. సిడ్నీ వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో పాకిస్తాన్ (NZ vs PAK).. అడిలైడ్ వేదికగా జరిగే రెండో సెమీస్ లో ఇంగ్లండ్ తో భారత్ (IND vs ENG) తలపడనుంది. దీంతో ఈ మ్యాచుల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. (PC : TWITTER)
ఇక, 15 ఏళ్ల తర్వాత టీమిండియా మరో పొట్టి కప్ ను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. దీంతో, సెమీస్ కోసం తెగ కష్టపడుతుంది. అడిలైడ్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అయితే, ఓ సెంటిమెంట్ ఇప్పుడు టీమిండియా ఫ్యాన్స్ కు బోలెడు ఆనందాన్ని ఇస్తుంది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఈ సారి టీమిండియాకు టీ20 ప్రపంచకప్పు ఖాయమంటున్నారు (PC : TWITTER)