2007 టి20 ప్రపంచకప్ లో భాగంగా ఉన్నా ఆ తర్వాత పేలవ ఫామ్ తో జట్టుకు దూరమయ్యాడు. అనంతరం తన జీవితంలో జరిగిన కొన్ని అనూహ్య పరిణామాల వల్ల దినేశ్ కార్తీక్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఇక దినేశ్ కార్తీక్ క్రికెట్ ముగిసిందన్న సమయంలో రంజీ ప్లేయర్, కోల్ కతా నైట్ రైడర్స్ సహాయ కోచ్ అభిషేక్ నాయర్ అతడి పాలిట ఆపద్భాందవుడిలా కనిపించాడు.