ఐపీఎల్-2022 (IPL 2022)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తీవ్రంగా నిరాశ పరిచింది. కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేదు. మరోసారి లీగ్ దశలోనే ఎస్ఆర్హెచ్ ఇంటిముఖం పట్టింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన ఎస్ఆర్హెచ్ ఆరు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
ఈ ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ విఫలమైనప్పటికీ కొంత మంది ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఉమ్రాన్ మాలిక్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ అత్యుత్తమంగా రాణించారు. ఇక మరి కొంత మంది ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన కూడా కనబర్చలేదు. ఈ క్రమంలో వచ్చే ఏడాది సీజన్‌కు ముందు ఓ ముగ్గురి ఆటగాళ్లని ఎస్ఆర్హెచ్ విడిచి పెట్టే అవకాశం ఉంది.
అబ్దుల్ సమద్ (Abdul Samad) : విధ్వంసకర బ్యాట్స్‌మన్ అబ్దుల్ సమద్‌పై ఎంతో నమ్మకముంచిన ఆరెంజ్ ఆర్మీ రూ.4 కోట్లతో రిటైన్ చేసుకుంది. అయితే, అతను మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అవకాశమిచ్చిన హైదరాబాద్.. ఆ తర్వాత పక్కనపెట్టేసింది. టీమ్ కాంబినేషన్ సెట్ అవ్వడంతో మరో అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలోనే అతన్ని వదులు కోవడం ఉత్తమమని సన్‌రైజర్స్ భావిస్తోంది.
సీన్ అబాట్ (Sean Abbott) : ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన సీన్ అబాట్‌ను సన్‌రైజర్స్ రూ.2.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. బీబీఎల్ అనుభవం , అక్కడి ప్రదర్శన ఆధారంగా సన్‌రైజర్స్ తీసుకోగా.. అతను మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన అతను ఓవర్‌కు 11.75 చొప్పున 47 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో.. అతన్ని పక్కనపెట్టాలని సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
శ్రేయాస్ గోపాల్(Shreyas Gopal) : స్పెషలిస్ట్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా శ్రేయాస్ గోపాల్‌ను తీసుకున్న సన్‌రైజర్స్.. అతను ఆశించిన రీతిలో రాణించకపోవడంతో వదిలేయాలనుకుంటుంది. అతనికి బదులు వాషింగ్టన్ సుందర్,జగదీష్ సుచిత్లనే ఎక్కువ అవకాశాలిచ్చింది. ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన శ్రేయాస్ గోపాల్ 11.33 ఎకానమీతో 34 పరుగులిచ్చాడు. ఓ వికెట్ తీశాడు.