హర్భజన్ సింగ్ గత నెల పంజాబ్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో ఈ రాష్ట్రం నుంచి ఐదు స్థానాలు దక్కాయి. గతేడాది డిసెంబరులో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన హర్భజన్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
103 టెస్టుల్లో 417 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన నాలుగో భారత బౌలర్‌గా ఉన్న హర్భజన్ సింగ్, టెస్టుల్లో రెండు సెంచరీలు, 9 హాఫ్ హాఫ్ సెంచరీలతో 2224 పరుగులు కూడా చేశాడు.236 వన్డే మ్యాచులు ఆడిన హర్భజన్ సింగ్, 269 వికెట్లు తీశాడు. 28 టీ20 మ్యాచుల్లో 25 వికెట్లు తీసి... ఓవరాల్‌గా 711 అంతర్జాతీయ వికెట్లు తీశాడు.
2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీసిన హర్భజన్ సింగ్, భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి బౌలర్‌గా నిలిచాడు.2001, మార్చి 11న ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, షేన్ వార్న్‌లను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించిన భజ్జీ, అదే మ్యాచ్‌లో మాథ్యూ హేడెన్, మార్క్ వాగ్, స్టీవ్ వా, జాసన్ గిలెస్పీ వికెట్లు తీశాడు.