విశ్వక్రీడలు ఒలింపిక్స్ మరికొన్ని రోజుల్లో టోక్యోలో ప్రారంభం కాబోతున్నాయి. వేలాది మంది అథ్లెట్లు పతకాల వేట కోసం టోక్యో చేరుకోనున్నారు. ఎంతో మందికి ఈ ఒలింపిక్స్ కోసం ఆనందంగా ఎదురు చూస్తున్నారు. టోక్యో నగరంలో అత్యాధునిక స్టేడియంలు, సర్వాంగ సుందరంగా అలంకరించుకున్నాయి. ఈ ఆనందాల వెనుక విషాద గాధలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక కథే టోక్యోకి చెందిన కోహీ జిన్నోది. అదేంటో ఒకసారి చూద్దాం. (REUTERS Photo)
టోక్యో నగరంలో నివసించే కోహీ జిన్నో (79) చూపిస్తున్న ఈ ఫొటో 1957 జనవరి 2న తన పాత ఇంటి ముందు తీసుకున్నది. ఆ పాత ఇల్లు సెంట్రల్ టోక్యోలో ఉన్నది. ఆ ఇంటిని 1964 టోక్యో ఒలింపిక్స్ కోసం నిర్మించిన ప్రధాన స్టేడియం కోసం వదులుకోవల్సి వచ్చింది. ఆ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కూల్చి అక్కడ స్టేడియం నిర్మించింది. ఇక అతడు ఆ తర్వాత కసుమిగవోక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో నివసించేవాడు. 2013 సెప్టెంబర్ 13న అతడిని అక్కడి నుంచి కూడా ప్రభుత్వాధికారులు వెల్లగొట్టారు. నేషనల్ ఒలింపిక్ స్టేడియం నిర్మాణం కోసం రెండో సారి కూడా ఇంటిని కోల్పోవలసి వచ్చింది. (REUTERS Photo)
1964 ఒలింపిక్స్ సందర్భంగా తమ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. తమతో పాటు చుట్టు పక్కల ఇళ్లు కూడా ప్రభుత్వం సేకరించింది. వాటన్నింటినీ నేలమట్టం చేసి నేషనల్ స్టేడియం నిర్మించింది. ఆ చుట్టు పక్కన ఉన్న చెట్లను కొట్టేయడమే కాకుండా పక్కనే ఉన్న నదిని కూడా పూడ్చి కాంక్రీట్ జంగిల్లా మార్చేసింది. (REUTERS Photo)
1964లో ఇళ్లు కోల్పోయిన వారి కోసం ప్రభుత్వం ఈ పబ్లిక్ హౌసింగ్ కాంప్లెక్ నిర్మించింది. అయితే 2020 ఒలింపిక్స్ కోసం మరోసారి ఈ కాంప్లెక్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. మొదటి ఇల్లు స్వాధీనం చేసుకున్నాక చాన్నాళ్ల పాటు కార్లు కడిగే పనిలో కుదిరాడు. దానికి సమీపంలోని ఒక చిన్న గదిలో జిన్నో, అతని భార్య యసుకో, ఇద్దరు పిల్లలతో నివసించేవాడు. ఆ తర్వాత ఈ పబ్లిక్ హౌసింగ్ క్లాంప్లెక్స్లోకి వచ్చాడు. ఆ పక్కనే మరోసారి పొగాకు దుకాణం ఓపెన్ చేశాడు. (REUTERS Photo)