A LOOK AT VIRAT KOHLIS HIGHEST ACHIEVEMENTS AS TEAM INDIA SKIPPER SRD
Virat Kohli Highest Achievements : టెస్ట్ కెప్టెన్ గా కోహ్లీ సాధించిన అతిపెద్ద ఘనతలు ఇవే..!
Virat Kohli Highest Achievements : టీమిండియా (Team India) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సంచలన నిర్ణయం తీసుకుని ఫ్యాన్స్ ను షాక్ లోకి నెట్టాడు. టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
2015 సంవత్సరంలో పూర్తిస్థాయి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ బాధ్యతలు తీసుకున్నాడు. అంతే కాకుండా కెప్టెన్ గా తొలి మూడు ఇన్నింగ్స్ ల్లో సెంచరీ సాధించిన బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ.
2/ 8
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2015 లో ఫస్ట్ సిరీస్ విక్టరీ కొట్టింది టీమిండియా. శ్రీలంకపై ఈ సిరీస్ విజయం సాధించింది కోహ్లీ సేన.
3/ 8
2016లో విండీస్ పై 2-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది కోహ్లీసేన.
4/ 8
అంతేకాకుండా తొలి సారి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ విదేశాల్లో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. శ్రీలంకను వారి గడ్డపైనే 3-0 తేడాతో చిత్తు చేసింది టీమిండియా.
5/ 8
అయితే, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అతిపెద్ద విజయం 2018-19 బోర్డర్ గావస్కర్ ట్రోఫీ. ఆస్ట్రేలియాను వారి గడ్డపై 2-1 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది కోహ్లీసేన. అంతేకాకుండా.. ఈ ఘనత సాధించిన ఫస్ట్ ఆసియా కెప్టెన్ గా కోహ్లీ చరిత్ర క్రియేట్ చేశాడు.
6/ 8
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టెస్టుల్లో టీమిండియా ఓ మహశక్తిగా ఎదిగింది. 2016 నుంచి 2020 వరకు ఏకంగా 42 వారాల పాటు టీమిండియా టెస్టుల్లో నెం.1 టీమ్ గా నిలిచింది.
7/ 8
విరాట్ కోహ్లీ 2020-21లో జరిగిన బోర్డర్ గావస్కర్ ట్రోఫి సిరీస్ ను మధ్యలో వదిలి స్వదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ ఇండియాకు వచ్చిన తర్వాత భారత్ 2-1 తేడాతో ఆ సిరీస్ ను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది.
8/ 8
ఇక, ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్ లో టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో ఒక మ్యాచ్ కొవిడ్ ఎఫెక్ట్ తో రద్దయిన సంగతి తెలిసిందే.