ఓవైపు టీమిండియా ప్రతిష్టాత్మక బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం రెడీ అవుతుంటే... మరోవైపు రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. విరాట్ కోహ్లీ నుంచి సారథ్యం స్వీకరించిన తర్వాత రోహిత్.. రెండు మేజర్ ఐసీసీ టోర్నీలైన ఆసియాకప్, టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా టీమ్‌ను నడిపించాడు. కానీ ఆ రెండింటిలోనూ అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయాడు. దీంతో రోహిత్ టెస్ట్ కెప్టెన్సీకి ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్ కఠిన సవాల్‌గా మారింది. Image credit ESPN CRICINFO
ఈ నెల 9 నుంచి మొదలయ్యే ఈ మెగా సిరీస్ ను గెలవడంతో పాటు ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ టీమిండియా విజయం సాధించి తీరాలి. అలా జరిగితేనే హిట్‌మ్యాన్.. టెస్ట్ కెప్టెన్‌గా మరికొన్ని రోజులు ముందుకు సాగుతాడు. లేదంటే అతని ప్లేస్‌లో కేఎల్ రాహులో లేక మరెవరైనా రావచ్చొనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ ఇప్పటికే రోహిత్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. Image credit ICC
2013కు ముందు ఇండియా చివరిసారి ఐసీసీ ట్రోఫీని నెగ్గింది. ఆ తర్వాత 2018లో ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. రోహిత్ కెప్టెన్ అయ్యాక.. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో టీమిండియా సూపర్ పెర్ఫామెన్స్ చేస్తోంది. వన్డే, టీ20ల్లో ఇండియా నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించింది. టెస్ట్‌ల్లోనూ టాప్ ర్యాంక్‌కు చేరువవుతోంది. Image credit TheHindu
ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో ఐసీసీ ట్రోఫీని కోల్పోలేమని.. ఈ విషయాన్ని రోహిత్‌కు ఆల్రెడీ చెప్పినట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. మనం వరల్డ్‌కప్ గెలవకపోతే ద్వైపాక్షిక సిరీస్‌లో ఎన్ని విజయాలు సాధించినా వృథాయే. అందుకే ఈసారి ఆ కరువు నుంచి బయటపడాలని భావిస్తున్నామన్నారు బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. Image credit ESPN CRICINFO