35 YEARS AFTER KAPIL DEV BUMRAH TO BE THE FIRST FAST BOWLER TO LEAD INDIA TEST SIDE SJN
Jasprit Bumrah : అదే జరిగితే కపిల్ దేవ్ తర్వాత మళ్లీ బుమ్రానే.. చరిత్రకు అడుగు దూరంలో స్పీడ్ గన్
Jasprit Bumrah : ప్రస్తుతం రోహిత్ శర్మ ఐసోలేషన్ లో ఉన్నాడు. దాంతో జూలై 1న ఇంగ్లండ్ తో ఆరంభమయ్యే రీషెడ్యూల్ మ్యాచ్ నాటికి అతడు కోలుకోవడం కష్టమే. ఫలితంగా భారత్ కు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు.
భారత పర్యటనలో ఉన్న టీమిండియా (Team India)కు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. లీసెస్టర్ షైర్ తో జరుగుతోన్న ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడుతోన్న భారత సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) కరోనా బారిన పడ్డట్లు బీసీసీఐ (BCCI) ట్విట్టర్ ద్వారా ఆదివారం ప్రకటించింది.
2/ 6
ప్రస్తుతం రోహిత్ శర్మ ఐసోలేషన్ లో ఉన్నాడు. దాంతో జూలై 1న ఇంగ్లండ్ తో ఆరంభమయ్యే రీషెడ్యూల్ మ్యాచ్ నాటికి అతడు కోలుకోవడం కష్టమే. ఫలితంగా భారత్ కు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు.
3/ 6
కేఎల్ రాహుల్ ఈ పర్యటనలో లేకపోవడంతో రోహిత్ డిప్యూటీగా బుమ్రా ఉన్నసంగతి తెలిసిందే. తాజాగా రోహిత్ కరోనా బారిన పడటంతో రీ షెడ్యూల్ టెస్టులో భారత్ ను బుమ్రా నడిపించే అవకాశం ఉంది.
4/ 6
అదే జరిగితే 35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాకు ఒక ఫాస్ట్ బౌలర్ కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉంది. 1987లో చివరిసారిగా భారత జట్టుకు కపిల్ దేవ్ కెప్టెన్ గా వ్యవహరించాడు.
5/ 6
రోహిత్ శర్మ ఎన్ని రోజుల్లో కోలుకుంటాడనే అంశంపై సమాచారం లేదు. ప్రస్తుతం అతడు ఐదు రోజుల ఐసోలేషన్ లో ఉన్నట్లు సమాచారం. సిరీస్ కు ముందు కూడా అశ్విన్ కరోనా బారిన పడ్డాడు.
6/ 6
దాంతో అతడు మిగతా జట్టుతో కలిసి ఇంగ్లండ్ కు వెళ్లలేదు. ప్రస్తుతం అశ్విన్ కోలుకుంటున్నట్లు తర్వలోనే ఇంగ్లండ్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తాజాగా రోహిత్ కరోనా బారిన పడటంతో.. మిగిలిన భారత ప్లేయర్లలోనూ కరోనా గుబులు పట్టుకుంది.