ప్రస్తుతం దాదాపు అన్ని క్రికెట్ జట్లు 2023 వన్డే ప్రపంచ కప్‌పై దృష్టి పెట్టాయి. ఎలాంటి జట్టుతో టోర్నీలో దిగాలనే అంశంపై కసరత్తు చేస్తున్నాయి. 2023 వన్డే ప్రపంచ కప్ అక్టోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19న ముగిసే అవకాశం ఉంది. 10 టీమ్‌లు పాల్గొనే ఈ టోర్నీకి ఇండియా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. మెగా టోర్నీ కోసం BCCI దాదాపు 12 వెన్యూ లను ఎంపిక చేసినట్లు ESPNcricinfo తెలిపింది. 2023 వరల్డ్ కప్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు పరిశీలిద్దాం.
* అహ్మదాబాద్‌లో ఫైనల్ : ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లో వరల్డ్ కప్ ఫైనల్ నిర్వహించనున్నారు. అహ్మదాబాద్‌తో పాటు ఎంపిక చేసిన మైదానాల్లో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గౌహతి, హైదరాబాద్, కోల్‌కతా, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్, ముంబై ఉన్నాయి. మొత్తం టోర్నమెంట్లో 46 రోజుల వ్యవధిలో మూడు నాకౌట్లతో సహా 48 మ్యాచ్‌లు ఉంటాయి.
ట్యాక్స్ ఎగ్జంప్షన్పై భారత ప్రభుత్వం వైఖరిని BCCI త్వరలో ICCకి అప్డేట్ చేయనుంది. 2014లో ఐసీసీతో బీసీసీఐ సైన్ చేసిన హోస్ట్స్ అగ్రిమెంట్లో ట్యాక్స్ ఎగ్జమ్షన్ భాగంగా ఉంది. ఈ ఒప్పందంతో భారత్‌కు మూడు మెన్స్ ఈవెంట్లు.. 2016 టీ20 ప్రపంచకప్, 2018 ఛాంపియన్స్ ట్రోఫీ (తరువాత 2021 టీ20 ప్రపంచకప్‌గా మారింది, కరోనా కారణంగా UAE, ఒమన్‌లో జరిగింది), 2023 వన్డే ప్రపంచ కప్ లభించాయి.