అమరావతిలో భూముల కొనగోళ్ల అంశంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని పదే పదే ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం... దీనిపై సీబీఐ విచారణ కోరేందుకు సిద్ధమవుతోందనే టాక్ వినిపిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
ఇందుకు సంబంధించి న్యాయనిపుణులతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. (File)
3/ 8
అమరావతి ప్రకటనకు ముందుకు జరిగిన భూ కొనుగోళ్లపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇవ్వడంతో... దీనిపై సీబీఐ విచారణ కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. (File)
4/ 8
అమరావతి రాజధాని పరిధిలో 4 వేల ఎకరాలు ఎవరెవరు కొన్నారో కేబినెట్ సబ్ కమిటీ నివేదకలో పేర్కొంది. ఈ సబ్ కమిటీ నివేదికలో పలువురు టీడీపీ నేతల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
అమరావతిలో రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు, వారి బినామీలు పెద్ద ఎత్తున భూములను కొనుగోళ్లు చేశారని ఏపీ మంత్రులు ఆరోపించారు. (ఫైల్ ఫోటో)
6/ 8
ఎవరెవరు ఎన్ని ఎకరాల భూములు కొనుగోలు చేశారనే దానిపై కూడా అసెంబ్లీలో పేర్లు వెల్లడించారు. (File Photo)
7/ 8
అయితే ప్రభుత్వం ఆరోపణలను ఖండించిన టీడీపీ నేతలు... దీనిపై విచారణ చేసుకోవాలని సవాల్ విసిరారు. (File)
8/ 8
ఈ నేపథ్యంలో దీనిపై సీబీఐ విచారణ కోరాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.(ఫైల్ ఫోటో)