YS Sharmila Vs YS Jagan: దివంగత నేత వైఎస్ఆర్ రాజకీయ వారసులు వైఎస్ షర్మిల-ఏపీ సీఎం వైఎస్ జగన్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా..? ఇద్దరి మధ్య విబేధాలు నిజమేనా..? వైఎస్ కుటుంబం రాజకీయంగా ఇప్పుడు రెండుగా చీలిందా.. ఇవన్నీ ఎప్పటి నుంచో సమాధానం లేని ప్రశ్నలుగానే ఉంటున్నాయి. దీనిపై మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ అందరూ మాట్లాడుతున్నారు. వివాదాలు నిజమే అంటున్నారు. ఇతర పార్టీల నేతలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై నేరుగా ఇటు జగన్ గానీ, షర్మిల గానీ ఎప్పుడు నోరు విప్పలేదు.
మరోవైపు ఎయిర్ పోర్టులో సీఎం జగన్ ఉన్నారని తెలియడంతో చెల్లి షర్మిల మధ్యలో కాసేపు ఆగారని.. జగన్ వెళ్లిన తరువాతే ఆమె అక్కడకు చేరుకున్నారనే ప్రచారం ఉంది. ఆ తరువాత షర్మిల్ పార్టీ పెట్టిన ముందు రోజే సీఎం జగన్ పరోక్షంగా షర్మిలపై వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వేలు పెట్టడం తనకు ఇష్టం లేదంటూ కామెంట్ చేశారు. అయితే మరుచటి రోజు.. పార్టీ ప్రకటన సందర్భంగా నేరుగా జగన్ పైనే పరోక్ష పంచ్ లు వేశారు షర్మిల.
అప్పులు చేసి ప్రభుత్వ పాలన చేయడం కరెక్టు కాదని అమె అన్నను పరోక్షంగా విమర్శించారు. ఎందుకంటే ఏపీలో ప్రస్తుత పాలన అలాగే కొనసాగుతోంది. అప్పులు రెట్టింపు అవుతున్నాయి. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనే ఆ విషయాన్ని ఒప్పుకున్నారు. అప్పులు చేయక తప్పడం లేదని. అందుకే ఆమె అన్నను ఉద్దేశించే ఆమె అలా మాట్లాడరని ప్రచారం ఉంది. అలాగే తెలంగాణకు రావాల్సిన ఒక్క నీటి బొట్టును కూడా అడ్డుకుంటే ఊరుకో అంటూ అన్నకే వార్నింగ్ ఇచ్చారు. ఇలా పరోక్షంగా మాట్లాడిన ఆమె.. తొలిసారి నేరుగా ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు..
తాజాగా మీడియాతో మాట్లాడిన షర్మిల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ తో విబేధాలపై క్లారిటీ ఇచ్చారు. అన్నమీద కోపంతోనే తెలంగాణలో పార్టీ పెట్టారని మీడియా ప్రతినిధి ఒకరు అడిగిన ప్రశ్నకు ఘాటుగానే సమాధానం చెప్పారు. అన్నపై అలిగినంత మాత్రానా వేరే పార్టీ పెడతారా ఎవరైనా అని తిరిగి ప్రశ్నించారు.
ఎవరితోనో విభేదాల వల్ల వైఎస్ఆర్టీపీ పుట్టలేదని.. గుండెల్లోంచి పుట్టిన పార్టీ అని స్పష్టం చేశారు. అంటే ఆమె తన అన్నతో విబేధాలు లేవని స్పష్టంగా చెప్పలేకపోయారు. అన్నపై కోపంతో పార్టీ పెడతారా అని ప్రశ్నింస్తూ ఇద్దరి మధ్య విబేధాలు నిజమే అని హింటిచ్చారు. అక్కడితోనే ఆగలేదు. జగన్ ప్రభుత్వం తీరుపైనా స్పందించారు..
ఏపీలో జగన్ పాలనపై మాట్లాడిన ఆమె.. ప్రస్తుతం ఏపీలో రాజన్న రాజ్యం నెలకొల్పేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని.. ఇప్పటికే పాలనకు రెండేళ్లు పూర్తైందని.. ఒకవేళ రాజన్న పాలన ఏపీలో అమలు చేయకపోతే.. ప్రజలే ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే మరోసారి రెండు రాష్ట్రాల మధ్య జల వివాదంపైనే స్పందించారు. బోర్డు మీటింగ్లకు పిలిస్తే వెళ్లనందునే కేంద్రం కలగజేసుకొని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు షర్మిల. తెలంగాణ దక్కాల్సిన ఒక్క నీటి బొట్టును కూడా వదులుకోబోమని.. ఇతర ప్రాంతాలకు చెందాల్సిన ఒక్క నీటి బొట్టును కూడా అడ్డుకోబోమని ఆమె స్పష్టం చేశారు.