వైసీపీ తరపున రాజ్యసభకు ఎంపిక కాబోయే ఆ నలుగురు ఎవరనే దానిపై చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది.
2/ 8
మండలి రద్దు కారణంగా మంత్రి పదవులు కోల్పోయే పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణకు రాజ్యసభ సీట్లు దాదాపు ఖరారైపోయాయనే ప్రచారం సాగుతోంది.
3/ 8
దీంతో పాటు కేంద్ర మాజీమంత్రి, ప్రముఖ సినీనటుడు చిరంజీవి కూడా వైసీపీ తరపున పెద్దల సభకు ఎంపికయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
4/ 8
వీరితో పాటు మరికొన్ని పేర్లు కూడా రాజ్యసభ రేసులో ఉన్నాయి. ఇదిలా ఉంటే... వైసీపీ తరపున రాజ్యసభకు షర్మిలను ఎంపిక చేస్తే బాగుంటుందని పలువురు వైసీపీ నేతలు సీఎం జగన్కు సూచించినట్టు తెలుస్తోంది.
5/ 8
షర్మిలను రాజ్యసభకు పంపిస్తే... కేంద్రస్థాయిలో వైసీపీ ఇమేజ్ మరింత పెరుగుతుందని కొందరు వైసీపీ నేతలు భావిస్తున్నారు.
6/ 8
విజయసాయిరెడ్డితో కలిసి షర్మిల కూడా రాష్ట్రానికి కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని వైసీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
7/ 8
అయితే షర్మిలకు పార్టీలో క్రియాశీలక పదవులు ఇచ్చే విషయంలో జగన్ ఆలోచన ఏ విధంగా ఉందనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు.
8/ 8
గతంలో షర్మిలకు వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా వైసీపీ తరపున రాజ్యసభ రేసులో షర్మిల ఉన్నట్టు ప్రచారం జరుగుతుండటం విశేషం.