YS JAGANMOHAN REDDY FOLLOWING FOOT STEPS OF MAHATMA GANDHI SAYS AP SPEAKER TAMMINENI SEETHARAM BA
ఈ వైసీపీ నేత గాంధీకి అసలైన వారసుడు: ఏపీ స్పీకర్
గాంధీజీకి నిజమైన వారసుడు వైఎస్ జగన్ అని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. గాంధీ చూపిన మార్గాన్ని జగన్ తూచ తప్పకుండా అనుసరిస్తున్నారని జగన్ను ప్రశంసించారు.
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం జగన్ ను ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. భూమి కోసం, భుక్తి కోసం పోరాడుతున్న గిరిజనులను గుర్తించి ఏకైక నాయకుడు సీఎం జగన్ అని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.
2/ 5
గాంధీజీకి నిజమైన వారసుడు వైఎస్ జగన్ అని పేర్కొన్న ఆయన గాంధీ చూపిన మార్గాన్ని తూచ తప్పకుండా అనుసరిస్తున్న నేత జగన్ అని అన్నారు.
3/ 5
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్న ఆయన ఏపీ రాష్ట్రంలో ఉన్నది గుడ్డి ప్రతిపక్షమని అన్నారు.
4/ 5
జనం టాక్సులతో పథకాలు నడిపిస్తున్నారని జగన్ ని విమర్శిస్తున్నారని, మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం టాక్సులు వసూలు చేయలేదా అని ఆయన ప్రశ్నించారు.
5/ 5
ట్యాక్సుల ద్వావరా వసూలు చేసిన సొమ్మును జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారన్న స్పీకర్ తమ్మినేని 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు రాకుండా కోర్టులకు వెళ్లి స్టే తెచ్చారని టీడీపీపై మండిపడ్డారు.