ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీలో (AP Assembly) ఆమోదించింది. దీంతో సినిమా టికెట్ల అమ్మకాలపై పూర్తి నియంత్రణ ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లింది. అలాగే సినిమా షోల విషయంలోనూ ఖచ్చితమైన నిబంధనల పాటించాలని చట్టంలో స్పష్టం చేసింది.
ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన చట్టసవరణ చిన్నసినిమాల సంగతి పక్కనబెడితే పెద్దసినిమాలకు ఊహించని షాకిచ్చిందనే చెప్పాలు. ముఖ్యంగా RRR, భీమ్లా నాయక్ (Bheemla Naik), అఖండ (Akhanda Movie), ఆచార్య (Acharya Movie), సర్కారువారి పాట (Sarkaruvari Pata), పుప్ప (Pushpa), రాధేశ్యామ్ (Radhe Shyam) వంటి భారీ బడ్జెట్ సినిమాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. (Twitter/Photo)
టికెట్ రేట్లతో పాటు షోల సంఖ్యను పెంచుకునే అవకాశం లేకపోవడంతో భారీ బడ్జెట్ సినిమాలకు నష్టపోక తప్పనిపరిస్థితి. గతంలో వారం లేద రెండు వారాల్లో పెట్టిన బడ్జెట్ లో కనీస 70శాతం టికెట్ల రూపంలో వచ్చేలా టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారు. ఇప్పుడు చట్టం చేయడంతో ఏ ఒక్క సినిమాకు ప్రభుత్వం నిబంధనలు సడలించే అవకాశం లేదు.
ప్రజల బలహీనతలు సొమ్ము చేసుకునే వ్యవస్థను కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్ని నాని స్పం చేశారు. ఆన్లైన్ లో టిక్కెట్లు అమ్మితేనే దోపిడీ అరికట్టగల మార్గమని ఆయన అన్నారు. షోలు కూడా ప్రభుత్వం నిర్దారించిన సమయంలోనే షోలు ప్రదర్శించాలని.., పరిశ్రమ ప్రభుత్వ నిబంధనల కు లోబడే నడుచుకోవాలి స్ట్రాంగ్ స్టేట్ మెంట్ ఇవ్వడంతో పెద్దసినిమాలకు అది అతిపెద్ద షాక్ అనే చెప్పాలి.
ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించగా.. RRR సినిమా నిర్మాత డీవీవీ దానయ్య కూడా టికెటింగ్ విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది నిజంగా తమ సినిమాకు కాస్త ఇబ్బందేనన్న దానయ్య.. దీనిపై సీఎం జగన్ ను కూడా కలిసి మాట్లాడతామని చెప్పారు. తాజాగా అసెంబ్లీలో చట్టం చేయడంతో ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. (ప్రతీకాత్మకచిత్రం)