MLA Roja fire on tdp: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయం రచ్చ రచ్చ అవుతోంది. సీఎం జగన్ (CM Jagan) పై మాజీ మంత్రి అయ్యన్న (Ayyanna) వ్యాఖ్యలు.. తరువాత మాజీ సీఎం చంద్రబాబు (Ex CM Chandra Babu) ఇంటిని వైసీపీ నేతలు, కార్యకర్తలు ముట్టడించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. తాజాగా తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా (MLA Roja) మరో అడుగు ముందుకేసి.. చంద్రబాబు, లోకేష్, అయ్యన్నలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ పై అయ్యన్న వ్యాఖ్యలు చాలా బాధాకరం అన్నారు రోజా. ఆయన చేసిన కామెంట్స్‌ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తరువాత.. ఆలయ ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతల తీరును తప్పు పట్టారు. సీఎం జగన్ ను కించపరిస్తే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని ఆమె హెచ్చరించారు.
సీఎం జగన్ ను విమర్శించే ముందు టీడీపీ నేతలు గతం గుర్తు చేసుకోవాలన్నారు. చంద్రబాబు.. కోడెలకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మానసిక క్షోభకు గురిచేసినప్పుడు అయ్యన్న ఏమైపోయారని రోజా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో జగన్‌ని చూసి నేర్చుకోవాలని సూచించారు. టీడీపీ నేతల దగ్గర సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. జగన్ జనం మెచ్చిన నేత అని గుర్తు చేశారు. జనంలో ఉన్న క్రేజ్ చూసి ఓర్వలేకే టీడీపీ నేతలు ఇలా చౌకబారు రాజకీయాలు చేస్తున్నారంటూ రోజా మండిపడ్డారు..
టీడీపీ నేతల చర్యల కారణంగానే జనాలు అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యే పదవి పీకేశారని.. మంత్రి పదవి పీకేశారని రోజా గుర్తు చేశారు. అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి పీకేశారని. అడ్డదారిన మంత్రి అయ్యిన లోకేశ్ పదవి పీకేశారని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జెండాను పీకేశారని.. ఇంకా ఏం పీకాలని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు... అయ్యన్న పాత్రుడు తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు.