VOTERS HEADING TO POLLING CENTERS IN ANDHRA PRADESH PANCHAYAT ELECTIONS HERE ARE THE DETAILS PRN
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్.. జిల్లాల వారీగా ఓటింగ్ శాతం వివరాలివే..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) పోలింగ్ కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6.30 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం 11గంటల ప్రాంతం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో 34.28శాతం పోలింగ్ నమోదైంది.
2/ 7
శ్రీకాకుళం జిల్లా -29.13% విశాఖపట్నం జిల్లా - 40.78% తూర్పుగోదావరి జిల్లా - 35.07% పశ్చిమ గోదావరి జిల్లా - 29% కృష్ణా జిల్లా - 36% గుంటూరు జిల్లా - 38% ప్రకాశం జిల్లా - 28.65% నెల్లూరు జిల్లా - 26.72% చిత్తూరు జిల్లా - 38.97% వైఎస్ఆర్ కడప - 29.21% కర్నూలు జిల్లా - 45.85% అనంతరం జిల్లా - 35.00%
3/ 7
రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీల్లో తొలి దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాల్లో 7,506 మంది... 20,157 వార్డులకు 43,601 మంది పోటీలో నిలిచారు.
4/ 7
88,523 మంది అధికారులు, సిబ్బందిని ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. తొలివిడతలో 3,249 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా 525 చోట్ల ఏకగ్రీవమయ్యాయి
5/ 7
పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 3.30 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 6.30గంటలకు ఫలితాలను ప్రకటిస్తారు.
6/ 7
అనంతపురం జిల్లా తలుపుల మండల కేంద్రంలో ఓటు వేసేందుకు వృద్ధురాలిని భుజాలపై ఎత్తుకెళ్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ హరిప్రసాద్
7/ 7
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో వికలాంగుడిని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్తున్న పోలీసులు