‘విజయలక్ష్మి గత పది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఆమెను డిశ్చార్జ్ చేయాలని నిర్ణయించడం జరిగింది. అయితే ఉదయం 5 గంటల సమయంలో ఆమెకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. నిపుణులైన వైద్యులు చికిత్స చేసినప్పటికీ.. లాభం లేకుండా పోయింది. ఆమె ఉదయం 6:45 గంటల సమయంలో మరణించినట్లు తెలియజేయడానికి మేము చింతిస్తున్నాము’అని విజయలక్ష్మి చికిత్స కోసం చేరిన Gem Hospitals ఒక ప్రకటనలో తెలిపింది.(Image-Twitter)
పన్నీర్ సెల్వం భార్య మరణవార్త తెలుసుకున్న అన్నాడీఎంకే బహిష్కృత నేత, దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ(చిన్నమ్మ) కూడా ఆస్పత్రికి వెళ్లారు. పన్నీర్ సెల్వం సతీమణి విజయలక్ష్మీ మృతిపట్ల సంతాపం తెలిపారు. అనంతరం ఓపీఎస్‌ను పరామర్శించారు. దాదాపు 20 నిమిషాల పాటు శశికళ ఆస్పత్రిలోనే ఉన్నట్టుగా సమాచారం. (Image-Twitter)