YSRCP: ఎన్నికల వేళ వైసీపీకి కొత్త టెన్షన్... పార్టీ గుర్తింపు రద్దుపై సస్పెన్స్.. షాక్ తప్పదా..?
YSRCP: ఎన్నికల వేళ వైసీపీకి కొత్త టెన్షన్... పార్టీ గుర్తింపు రద్దుపై సస్పెన్స్.. షాక్ తప్పదా..?
ఏపీలో స్థానిక సంస్థలు (AP Local Body Elections), తిరుపతి ఉపఎన్నిక (Tirupati By Election) నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (YSR Congress Party) మరో టెన్షన్ ఎదురవుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభంజనం కొనసాగుతోంది.
2/ 7
వరుస విజయాలతో జోష్ మీదున్న వైసీపీ నేతలు, కార్యకర్తలకు ఇప్పుడు మరో ఊహించని పరిణామం ఎదురవుతోంది.
3/ 7
వైఎస్ఆర్సీపీ గుర్తింపును రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ ముగిసింది.
4/ 7
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ఆర్ పేరును వాడకుండా చూడాలంటూ 'అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 'అధ్యక్షుడు మహబూబ్ బాషా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
5/ 7
ఈ పిటిషన్ పై వాదనలు ముగించిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈనెల 17న తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు.
6/ 7
వైఎస్ఆర్ పేరును వినియోగించుకునే హక్కు తమకుందని వైసీపీ వాదించగా.. ఆ పేరును ఈసీ ముందుగా తమకు కేటాయించిందని 'అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్' వాదించింది.
7/ 7
ఈనెల 17న ఎలాంటి తీర్పు వస్తుందనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.