నేను రాహుల్ గాంధీతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే... రాహుల్ గాంధీ తన చేష్టలతో, మాటలతో జనాలను నవ్విస్తూ ఉంటారు... అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్ గాంధీ ఫోటోని పోస్ట్ చేసి, కామెంట్ పెట్టింది మహిక శర్మ.
జనాలను నవ్విస్తూ ఉండేవాళ్లంటే తనకెంతో ఇష్టమని... రాజు అంటే ఇలాగే ఉండాలని రాహుల్ గాంధీ గురించి వ్యాఖ్యానిస్తూ మహిక శర్మ చేసిన పోస్ట్... దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
ప్రతి ఒక్క వ్యక్తి ముఖాల్లో నవ్వులు నింపడేమ రాజు యొక్క కర్తవ్యం అంటూ హిందీలో కామెంట్ కూడా పెట్టింది మహిక శర్మ. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో తెగ బిజీగా గడుపుతున్న రాహుల్ గాంధీ... మహిక శర్మ లవ్ ప్రపోజల్‌పై స్పందించకపోయినా నెటిజన్స్ మాత్రం అమ్మడిపై విరుచుకుపడుతున్నారు.
అయితే నెటిజన్స్ బారిన పడడం మహిక శర్మకు కొత్తేమీ కాదు. పుల్వామా దాడి జరిగిన సమయంలో, అభినందన్ పాక్ నుంచి తిరిగొచ్చిన సమయంలో బికినీ ఫోటోలు పోస్ట్ చేసి, రచ్చ చేసింది మహిక శర్మ...
రాహుల్ గాంధీ గెలుపు కోసం దుర్గాపూజ చేస్తానని చెప్పిన మహిక శర్మ... కొన్నాళ్ల క్రితం దేశంలో పోర్నో బ్యాన్ చేయొద్దంటూ ప్రభుత్వాన్ని వేడుకుంది. ప్రస్తుతం బ్రిటిష్ పోర్న్‌స్టార్ డానీ డీతో కలిసి ‘ది మోడ్రన్ కల్చర్’ అనే శృంగారభరిత చిత్రాన్ని తెరకెక్కిస్తున్న మహికాశర్మ... కొన్నాళ్ల కిందట సల్మాన్‌ఖాన్ బాడీ అమ్మాయిలకు బాగా నచ్చుతందంటూ కామెంట్లు చేసింది.