TTDP RELEASES MANIFESTO FOR GHMC ELECTIONS FREE WIFI AND FREE WATER CONNECTION BA
GHMC Elections: హైదరాబాద్ మొత్తం ఫ్రీ వైఫై, ఫ్రీ నల్లా కనెక్షన్లు.. ఏ పార్టీ మేనిఫెస్టోలో అంటే
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. భారీ వరాలు గుప్పించింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, ఇతర నేతలు మేనిఫెస్టోను ప్రకటించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. భారీ వరాలు గుప్పించింది. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, ఇతర నేతలు మేనిఫెస్టోను ప్రకటించారు.
2/ 4
ప్రతి ఇంటికి మంచి నీటి సరఫరా, పేదలు అందరికీ ఉచిత నల్లా కనెక్షన్లు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. అలాగే, హైదరాబాద్ మొత్తం ఫ్రీ వైఫై సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
3/ 4
ప్రతి ఇంటికి పైపులైన్ల ద్వారా వంట గ్యాస్ సరఫరా, ప్రతి పేదవారికి పక్కా గృహ నిర్మాణం, ప్రతి డివిజన్లో మొబైల్ ఆస్పత్రి, ఉచితంగా మందుల పంపిణీ వంటివి మేనిఫెస్టోలో ఉన్నాయి.
4/ 4
ఎంఎంటీఎస్, మెట్రో రైలు, ఆర్టీసీకి సింగల్ లెవల్ కార్డు, 200 గజాల లోపు స్థలాల్లో భవన నిర్మాణాలకు అనుమతులు ఉండాలన్న నిబంధన సడలింపు లాంటివి మేనిఫెస్టోలో పేర్కొన్నారు.