టీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతోంది. మర్రి రాజశేఖర్ రెడ్డి కొందరు యువతులతో కలసి క్యాట్ వాక్ చేస్తున్న ఫొటోలు, మద్యం తాగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మల్లారెడ్డికి చెందిన కాలేజీల్లో పలు ఫంక్షన్లు నిర్వహించినప్పుడు అల్లుడు కూడా వాటిలో పాల్గొన్నారు. యువతులతో కలసి ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేశారు. ఆ ఫొటోలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.
ఈ ఫొటోలతో రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా క్యాంపెయినింగ్ జరుగుతోంది. ఇలాంటి వారిని లోక్‌సభకు పంపిస్తారా? అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీ కుట్రపన్ని ఇలాంటి పాత ఫొటోలను ప్రచారం చేస్తున్నాయని మల్లారెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ స్పీడ్‌ను తట్టుకోలేక ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.