TRANSGENDER THAMANNA SIMHADRI NOMINATION ACCEPTED IN MANGALAGIRI MS
Photos : లోకేశ్‌పై పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్ తమన్నా నామినేషన్ ఆమోదం
మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్‌పై ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ల చివరి రోజైన సోమవారం(మార్చి 25) ఆమె నామినేషన్ దాఖలు చేయగా.. మంగళవారం అధికారులు ఆమె నామినేషన్‌కు ఆమోద ముద్ర వేశారు. మంగళగిరిలో లోకేశ్ ఓటమి ఖాయమని ధీమాగా చెబుతున్న తమన్నా సింహాద్రి ఇక్కడి ఎన్నికలను ఎంతవరకు ప్రభావితం చేయగలరన్నది ఆసక్తికరంగా మారింది.
స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేసేందుకు సోమవారం మంగళగిరి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వచ్చిన తమన్నా సింహాద్రి
2/ 4
నామినేషన్ పత్రాలను పరిశీలించిన అధికారులు తమన్నా అభ్యర్థిత్వానికి ఆమోద ముద్ర వేయడంతో.. ధ్రువీకరణ పత్రంతో తమన్నా సింహాద్రి..
3/ 4
నిజానికి జనసేన టికెట్‌పై మంగళగిరి నుంచి పోటీ చేయాలని తమన్నా భావించారు. కానీ ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో చివరకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తనను గెలిపిస్తే మంగళగిరి ప్రజలకు నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తానని చెబుతున్నారు.
4/ 4
మంగళగిరిలో నారా లోకేశ్ ఓడిపోవడం ఖాయమని తమన్నా అంటున్నారు. లోకేశ్‌కు గెలుపుపై అంత ధీమా ఉంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలో దిగాల్సిందని అన్నారు.