తెలంగాణ వార్తలు, తెలంగాన వార్తలు, టీఎస్ వార్తలు, తెలుగు వార్తలు, తెలుగు బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ న్యూస్, telangana mlc elections 2021 telangana mlc list telangana mlc list 2020 telangana mlc elections telangana mlc elections 2021 date telangana mlc seats telangana mlc salary telangana mlc elections 2021 results telangana mlc names telangana mlc governor quota, telangana mlc elections,telangana mlc elections 2021,mlc elections in telangana,mlc elections in telangana 2021,mlc elections,telangana news,mla quota mlc elections,telangana politics,debate on telangana mlc elections fight 2021,kcr about mlc elections,telangana mlc election,mlc elections 2021,mla quota mlc elections 2021,mlc elections telangana,telangana graduate mlc elections 2021,trs vs congress in telangana mlc elections,telangana elections,mlc kavitha, telangana mlc list 2020 telangana mlc elections 2021 date telangana mlc list 2021 mlc elections in telangana telangana by-election 2021 mlc elections telangana notification 2021 voter list 2021 telangana mlc telangana list, Telangna latest News, telangna News, ts News, Telugu News, Breaking news in Telugu, Latest telangna News, telangna Latest News, telangna News Today, Today Telugu News, తెలంగాణ వార్తలు, తెలంగాన వార్తలు, టీఎస్ వార్తలు, తెలుగు వార్తలు, తెలుగు బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ న్యూస్, TS MLC , telangana mlc elections , trs, localbody mlc , telangana news, letest news, ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు, తెలంగాణ వార్తలు, లెటెస్ట్, తెలుగు న్యూస్," width="1600" height="1600" /> స్థానిక సంస్థల కోటాలో మొత్తం 12 MLC స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల సంఘం. ఆరుగురు ఎమ్మెల్సీలు ఏక్రగ్రీవం కాగా, మిగిలిన 6 స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతోంది. ఏకగ్రీవం అయిన ఆరు చోట్లా అధికార TRS పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. మిగిలిన ఆరు చోట్ల నేడు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఐదు జిల్లాల్లోనూ గులాబీ దళానిదే మెజార్టీ కనిపిస్తున్నా.. ఎక్కడో అనుమానాలు కూడా వెంటాడుతున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి, కరీంనగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఈసీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొత్తం 37 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,326 ఓటర్లు ఉన్నారు.
ప్రస్తుత ఆయా పార్టీల బలాలు చూస్తే.. కారు స్పీడ్ కు తిరుగు ఉండకూడదు. ఖమ్మం, మెదక్ జిల్లాల్లో మాత్రమే కాంగ్రెస్ తమ అభ్యర్థులను పోటీలో దింపింది. కరీంనగర్లో TRSకు రాజీనామా చేసిన మాజీ మేయర్ రవీందర్‌సింగ్ పోటీలో ఉండడం కొంత ఆసక్తి రేకెత్తిస్తోంది. విజయం ఖాయమైనప్పటికీ TRS జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఓటర్లు చేజారకుండా జిల్లాల వారీగా అందరినీ క్యాంపులకు తరలించింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నిక జరిగే ఒక స్థానానికి TRS నుంచి దండె విఠల్, స్వతంత్ర అభ్యర్థిగా పి.పుష్పరనేణి పోటీ చేస్తున్నారు. మొత్తం 937 మంది ఓటర్లలో 717 మంది TRS పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులే ఉండటం విశేషం. దీంతో ఆదిలాబాద్‌లో టీర్ఎస్ విజయం నల్లేరుపై నడకలా ఉంది. అటు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రెండు స్థానాల్లో TRS అభ్యర్థులు భానుప్రసాద్‌రావు, ఎల్.రమణ బరిలో ఉన్నారు.
అయితే, ఇటీవలే TRS పార్టీకి రాజీనామా చేసిన రవీందర్‌సింగ్, మరో ఏడుగురు అభ్యర్థులు పోటీలో నిలిచారు. జిల్లాలో 1,324 మంది ఓటర్లు ఉండగా ఇందులో TRS నేతలు 996 మంది. ఇక ఉమ్మడి ఖమ్మంలోని ఒక స్థానానికి TRS, కాంగ్రెస్ అభ్యర్థులు తాతా మధు, రాయల నాగేశ్వరరావులతో పాటు ఇండిపెండెంట్లు శ్రీనివాసరావు, సుధారాణి పోటీలో ఉన్నారు. మొత్తం 768 మంది ఓటర్లలో TRSకు 490, కాంగ్రెస్‌కు 116 ఓట్లు ఉన్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లా విషయానికి వస్తే TRS అభ్యర్థి వంటేరు యాదవరెడ్డి, కాంగ్రెస్ నుంచి నిర్మల, స్వతంత్ర అభ్యర్థి మల్లారెడ్డి బరిలో నిలిచారు. మొత్తం 1,026 మంది ప్రజాప్రతినిధుల్లో 777 మంది TRS వారు.. 230 మంది ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక స్థానానికి TRS నుంచి కోటిరెడ్డితో పాటు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.