వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజాకు ఊహించని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఇటీవల చెన్నై ఆపోలో ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్న ఎమ్మెల్యే రోజా.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుటున్నారు. ఆస్పత్రిలో ఉన్న రోజాకు టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యంపై ఆరా తీసిన ఆయన.. త్వరగా కోలుకోవాలాని ఆకాంక్షించారు. బాలయ్య నుంచి ఫోన్ రావడంపై రోజా హర్షం వ్యక్తం చేశారు. అటు రోజా కుటుంబ సభ్యులు కూడా హ్యాపీగా ఫీలైనట్లు తెలుస్తోంది. మరోవైపు రోజాను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వైసీపీ నేతలు పరామర్శించారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తదితరులు చెన్నై వెళ్లి రోజాను పరామర్శించారు. బాలకృష్ణ, రోజా(ఫైల్ ఫోటో)