నరేంద్ర మోదీ హవాలో గల్లంతైన మాజీ ముఖ్యమంత్రులు వీళ్లే..

2019 ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హవాలో మాజీ ప్రధాన మంత్రి దేవగౌడ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా పలువురు మాజీ ముఖ్యమంత్రులు ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ స్థానాల్లో మట్టికరిచారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం ముందు చాలా మంది చేతులేత్తేసారు. కొన్ని దశాబ్ధాల పాటు ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పిన నేతలు కూడా మోదీ వేవ్‌లో కొట్టుకుపోయారు. ఇందులో డజనుకు పైగా మాజీ ముఖ్యమంత్రులున్నారు.