అన్న క్యాంటీన్ల మూసివేత. 5 రూపాయలకే అన్నం పెట్టే పథకాన్ని రద్దు చేయడం ప్రజల్లో తీవ్ర నిరాశను నింపింది. ఇసుక కొరత వల్ల పనులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కనీసం అన్న క్యాంటీన్లు ఉంటే.. అక్కడ తక్కువ డబ్బుతో కడుపు నింపుకొనే వారని, వాటిని మూసేయడం వల్ల ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని టీడీపీ విమర్శించింది.