CEC: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. మార్చి 7వ తేది వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించవద్దని ఆదేశించింది. మార్చి 7వ తేది 6.30గంటల తర్వాత ప్రకటించుకోవచ్చని తెలిపింది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కొత్త రూల్‌ని పాస్ చేసింది. ఏడు దశల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించవద్దని ఆదేశాలు జారీ చేసింది.
2/ 7
ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో ఎన్నికలు నిర్వహించబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం.
3/ 7
మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ విషయాన్ని గతంలోనే వెల్లడించిన ఎన్నికల కమిషన్... మార్చి 7వ తేది వరకూ ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదని ఆంక్షలు విధించింది.
4/ 7
ఏడు విడతలుగా జరిగే ఎన్నికల్లో ఫిబ్రవరి నెల 10న మొదటి దశ ఎన్నికలుప్రారంభమవుతాయి. మార్చి 7వ తేదితో చివరి విడత పోలింగ్ ముగుస్తుంది. అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 7 విడతల్లో ఎన్నికల్లో జరగనున్నాయి.
5/ 7
మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ విషయాన్ని గతంలోనే వెల్లడించిన ఎన్నికల కమిషన్... మార్చి 7వ తేది వరకూ ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదని ఆంక్షలు విధించింది.
6/ 7
మార్చి 7వ తేది సాయంత్రం 6.30గంటలు దాటిన తర్వాత ఎగ్జిట్‌పోల్స్ ప్రకటించుకోవచ్చని స్పష్టం చేసింది.
7/ 7
ఫిబ్రవరి 10న మొదటి విడత, ఫిబ్రవరి 14న రెండో విడత, ఫిబ్రవరి 20న మూడో విడత, ఫిబ్రవరి 23న నాలుగో విడత, ఫిబ్రవరి 27న ఐదో విడత, మార్చి 3న ఆరో విడత, మార్చి 7న ఏడో విడత పోలింగ్ జరగనుంది.