AP Panchayat Elections: సీఎం జగన్ ను చంద్రబాబు ఫాలో అవుతున్నారా..? అక్కడ నవరత్నాలు... ఇక్కడ పంచ సూత్రాలు
AP Panchayat Elections: సీఎం జగన్ ను చంద్రబాబు ఫాలో అవుతున్నారా..? అక్కడ నవరత్నాలు... ఇక్కడ పంచ సూత్రాలు
ఒక రాజకీయ పార్టీ సిద్ధాంతాన్ని.., మరో రాజకీయ పార్టీ అనుసరించడం పాలిటిక్స్ లో చాలా అరుదు. ఐతే ఒక పార్టీ వ్యూహాన్ని మరో పార్టీ కాపీ కొట్టడం మాత్రం కామన్. కానీ ప్రచార వ్యూహాలను ఫాలో అవడం మాత్రం కొంచెం వెరైటీ అనే చెప్పొచ్చు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh Politcs) రాజకీయాల్లో అలాంటి ట్రెండ్ ఉన్నట్లే కనిపిస్తోంది.ఓ విషయంలో మాత్రం వైఎస్ జగన్ (YS Jagan) ను చంద్రబాబు (Nara Chandra Babu naidu) ఫాలో అవుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.
2/ 5
నవరత్నాలు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి నిలబెట్టిన హామీలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఆ నవరత్నాలే మెట్లుగా నిలిచాయి. సూటిగా సుత్తిలేకండా... రెండంటే రెండు పేజీల్లో విడుదల చేసిన మేనిఫెస్టోని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు వైఎస్ జగన్.
3/ 5
రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం కల్పిస్తూ నవరత్నాల మేనిఫెస్టోని సీఎం జగన్ రూపొందించారు. ప్రజలకు సులభంగా అర్ధమయ్యేలా మేనిఫెస్టో రూపొందించి సక్సస్ అయ్యారు.
4/ 5
ఇప్పుడు పంచాయతీ ఎన్న్నికల్లో టీడీపీ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. రెండు పేజీలు, ఐదు పాయింట్లతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో విడుదల చేశారు.
5/ 5
పల్లె ప్రగతి – పంచ సూత్రాలు పేరుతో గ్రామాల్లో త్రాగునీరు, భద్రత-ప్రశాంతతకు భరోసా, ఆదర్శగ్రామాలుగా తీర్చిదిద్దడం, స్వయం సమృద్ధి, ఆస్తిపన్ను తగ్గింపు – పౌరసేవలను హైలెట్ చేస్తూ మేనిఫెస్టోను విడుదల చేశారు చంద్రబాబు.