వనపర్తి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నిరంజన్ రెడ్డి భుజంపై పచ్చ కండువా కప్పుకుని వచ్చారు. టీడీపీకి చెందిన పసుపు కండువాను టీఆర్ఎస్ అభ్యర్థి వేసుకోవడం.. అదీ నామినేషన్ వేళ ప్రత్యేకంగా ఆ కండువానే ధరించడం చర్చనీయాంశంగా మారింది. అయితే జ్యోతిష్యుడి సలహా మేరకే ఆయన గులాబీ కండువాను పక్కనబెట్టి పసుపు కండువాతో నామినేషన్ దాఖలు చేసినట్టు సమాచారం. పసుపు కండువాతో నామినేషన్‌కు వెళ్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్యుడు సూచించినట్టు తెలుస్తోంది.