TELANGANA ELECTION WAR WILL BE ONE SIDED SAYS MP KAVITHA
ఎన్నికల్లో వార్ వన్‌సైడే: ఎంపీ కవిత
తెలంగాణ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవుతుందని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. ప్రజాకూటమిలో టికెట్లకోసమే ఇంత గందరగోళం జరిగితే ఇక అభివృద్ధిపై నిర్ణయాలు ఎలా తీసుకుంటారో అర్థం అవుతోందన్నారు.
రాబోయే ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవుతుందని ఎంపీ కవిత అన్నారు. ధర్మపురి లోని లక్ష్మీ నరసింహ స్వామిని ఆమె దర్శించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పైరవీల పార్టీ.. ప్రజా కూటమిలో పేరులోనే ఉంది ప్రజల హృదయాల్లో కూటమి లేదన్నారు.
2/ 4
ప్రజాకూటమి టికెట్ల పంపకాల్లోనే గందరగోళం ఉంటే.. ఇంక అభివృద్ధి ఏం చేస్తారని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు బ్యాక్ డోర్ ద్వారా తన కుట్రలను కొనసాగించేందుకే కాంగ్రెస్ తో జత కట్టారని కవిత ఆరోపించారు.
3/ 4
కాంగ్రెస్ అభ్యర్థులను ఢిల్లీలో ఫైనల్ చేసి, అమరావతిలో ఒకే చేయించుకుని హైదరాబాద్‌లో ప్రకటించారంటూ కవిత ఎద్దేవా చేశారు. టిక్కెట్లు ఖరారులోనే ఢిల్లీ, అమరావతి, హైదరాబాద్ తిరిగిన కూటమి నేతలు తెలంగాణపై నిర్ణయాలు అలాగే తీసుకుంటారని చెప్పారు.
4/ 4
ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి కొప్పుల ఈశ్వర్ కృషి చేస్తుంటే.. అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్నారని కవిత అన్నారు.