కేంద్ర వడ్లు కొంటుందా లేదా అని స్పష్టం చేయాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. కొనే ఆలోచన ఉంటే కొంటామని చెప్పాలని.. లేదంటే లేదని చెప్పలని డిమాండ్ చేశారు. గోల్మాల్ ముచ్చట్లు వద్దని బీజేపీ నేతలకు సూచించారు. బండి సంజయ్ విషయం పరిజ్ఞానం లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడని విమర్శించారు. బీజేపీ రెండు స్టాంపులను తయారు చేసి పెట్టుకుందని, ఒకటి దోశద్రోహి, రెండు అర్బన్ నక్సలైట్ అని కేసీఆర్ మండిపడ్డారు.
62 లక్షల హెక్టార్లలో వరి పంట ఎక్కడుందని బండి సంజయ్ అన్నారని.. 6 హెలిక్యాప్టర్లు పెట్టి చూపిస్తానని కేసీఆర్ సమాధానమిచ్చారు. రాయలసీమ కరువు ప్రాంతమని... వారికి నీళ్లు రావాలని తాను చెప్పానని అన్నారు. గొర్ల పైసలు కేంద్రమే ఇచ్చిందని నిరూపిస్తే తాను నేను ఒకే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాల్ విసిరారు.
ఒకవేళ తమకు ఎంత పంట వచ్చినా పండించుకుంటామని వ్యవసాయం చేసే వారి విషయంలోనూ తాము అభ్యంతరం పెట్టబోమని అన్నారు. కొందరు తమ ఇంట్లో బియ్యం కోసం వడ్లు పండించుకుంటారని.. వారి విషయంలో కూడా ప్రభుత్వం అడ్డుచెప్పదని వ్యాఖ్యానించారు. అయితే తాము సాగుచేసిన వరి అమ్ముడుపోతుందని భావించి సాగు చేసే వాళ్లు మాత్రం అలా చేయొద్దని సీఎం కేసీఆర్ సూచించారు.
టీఆర్ఎస్ను రెండుసార్లు తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాారని సీఎం కేసీఆర్ అన్నారు. తాను దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పానని.. కానీ పరిస్థితులను బట్టి అలా చేయలేదని కేసీఆర్ అన్నారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ మరింత మెజార్టీతో గెలిచిందని.. ఈ విషయంలో తాను తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు కూడా సమర్థించారని కేసీఆర్ చెప్పుకొచ్చారు.