ఉదయం పూట కూడా ప్రచారంలో అలాగే తనదైన స్టైల్లో అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నేతలందరితో కలిసి సైకిల్ తొక్కి ఆకట్టుకున్న ఆమె.. ఏ మాత్రం అలసట చెందలేదు.. రోడ్డుపక్కన ఉన్న కొబ్బరి బొండాలు అమ్మే వ్యక్తి కనిపించడంతో.. ఆ టైరుబండి దగ్గరకు వెళ్లిన ఆమె.. అక్కడ ఉన్న ప్రజలతో మాటలు కలిపారు. సరదాగా కాసేపు కొబ్బరి బొండాలు కొట్టి అందరికీ అందించారు.
కేవలం కొబ్బరి బొండాలు కొట్టడమే కాదు. రోడ్డుపై ప్రచారానికి వెళ్తున్న ఆమె అక్కడ కనిపించే వీధి వ్యాపారుల కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకుని ముందుకు వెళ్తున్నారు. వారితో మాట్లాడుతూనే కాసేపు వారికి సహాయం చేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఓ మిర్చి బజ్జీల కొట్టు దగ్గర ఆగి ఆమె స్వయంగా బజ్జీలు వేసి.. అందరికీ తినిపించారు.